YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బు జమ..

వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని నవంబర్ 29వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ..

YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బు జమ..
Ys Jagan

Updated on: Nov 07, 2022 | 5:38 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని నవంబర్ 29వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొంది. ఇటీవల అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. MSP ధరకన్నా తక్కువకు అమ్ముకున్నామని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదని, దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని.. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరించాలన్నారు. వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు సహా రైతులకు కావాల్సినవన్నీ సమయానుకూలంగా సమకూర్చుకోవాలని అన్నారు. రబీ సీజన్‌లో 22.92 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..