Review Meeting: అర్హులందరికీ 90 రోజుల్లో పట్టాలు అందజేస్తాం.. సమగ్ర భూసర్వే సమీక్షలో సీఎం జగన్‌

Review Meeting:  రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి 90 రోజుల్లోగా పట్టాలు ఇస్తామనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విధానం సమర్థవంతంగా కొనసాగేలా...

Review Meeting: అర్హులందరికీ 90 రోజుల్లో పట్టాలు అందజేస్తాం.. సమగ్ర భూసర్వే సమీక్షలో సీఎం జగన్‌
CM YS Jagan Review Meeting

Updated on: Jan 20, 2021 | 8:50 PM

Review Meeting:  రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి 90 రోజుల్లోగా పట్టాలు ఇస్తామనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విధానం సమర్థవంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. బుధవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. లబ్దిదారుడికి పట్టా అందించి ఇంటి స్థలాన్ని చూస్తామని అన్నారు.

ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇప్పటికే రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాము, ఇందులో 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారికి అవగాహన కల్పించేలా, వారిలో పరిజ్ఞానం పెరిగేలా శిక్షణ ఇస్తున్నామని అన్నారు.

Also Read: TDP Leader Murder Case: గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో పురోగతి.. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు