ఏపీ: సీఎం జగన్ దావోస్ పర్యటన తేదీలు ఖరారు.. వివరాలు ఇవే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 22 నుంచి మే 26 వరకు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు..

ఏపీ: సీఎం జగన్ దావోస్ పర్యటన తేదీలు ఖరారు.. వివరాలు ఇవే..
Jagan

Updated on: May 12, 2022 | 2:02 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 22 నుంచి మే 26 వరకు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అమర్నాధ్ రెడ్డి,బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. దావోస్ పర్యటనలో నేపధ్యంలో ముఖ్యమంత్రి మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నెల 23వ తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం, 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం, 25వ తేదీన డీసెంట్రలైజ్డ్. ఎకానమీ దిశగా మార్పుపై సమావేశం జరగనుంది. దావోస్ పర్యటనపై మంత్రి అమర్నాధ్ కామెంట్స్.. వందల సంఖ్యలో కంపెనీలు దావోస్ ఎకనామిక్ ఫారమ్‌లో పాల్గొంటాయని మంత్రి అమర్నాధ్ రెడ్డి తెలిపారు. ఆ సదస్సులో కోవిడ్ ముందు ఉన్న పరిశ్రమల పరిస్థితి, కోవిడ్ తర్వాత పరిస్థితిపై చర్చ జరుగుతుందన్నారు. ఎకనామిక్ ఫోరమ్ అనేది పెద్ద కంపెనీల పారిశ్రామిక ప్రగతిపై చర్చించే వేదిక అని మంత్రి స్పష్టం చేశారు. దావోస్ పర్యటనతో వెంటనే పెట్టుబడులు రావని.. రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంతో ముందుకు వెళ్లి ఏపీకి రావాల్సిన పెట్టుబడులుపై చర్చిస్తామని వెల్లడించారు.