ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సీఎం జగన్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమయ్యారు. రెండు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్.. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వారి కోరడంతో వారు సానుకూలింగా స్పందించారు. తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముందుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో కూడా సమావేశం అయ్యారు.
ఇవాల్టి కార్యక్రమాల్లో భాగంగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమయ్యారు. వారితో పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్.. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తాము సూచించిన ప్రత్యామ్నాయలను మరోసారి పరిశీలించాలని సీఎం కోరారు. కాకినాడ సెజ్‌లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. వయోబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలని కోరారు.
కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్ గోయల్, షెకావత్, జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌లను సీఎం కలిశారు. వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం చర్చించారు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న సీఎం విజ్ఞప్తిపై గోయల్ సానుకూలంగా స్పందించారు. pic.twitter.com/gSLsExfWgN
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 11, 2021