CM Jagan Mohan Reddy: మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న సీఎం జగన్.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారి..

|

Apr 05, 2022 | 7:26 PM

ఏపీ(AP) సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి(Jaganmohan Reddy) తన గొప్ప మనస్సును మరోసారి చాటుకున్నారు...

CM Jagan Mohan Reddy: మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న సీఎం జగన్.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారి..
Ys Jagan Mohan Reddy
Follow us on

ఏపీ(AP) సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి(Jaganmohan Reddy) తన గొప్ప మనస్సును మరోసారి చాటుకున్నారు. అంబులెన్స్‌(Ambulance)కు దారి ఇచ్చి రాష్ట్ర ప్రజలందరికి ఆదర్శంగా నిలిచారు జగన్‌. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పోలీసులు పంపారు. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి పయనమయ్యారు. అదే టైమ్‌లో గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు 108 వాహనం వచ్చింది. అంబులెన్స్‌ సైరన్‌ను గమనించిన సీఎం జగన్.. అంబులెన్స్‌ అధికారులకు చెప్పారు. దీంతో అధికారులు అంబులెన్స్ పంపించారు. అత్యవసర సమయాల్లో తన ఆదేశాల కోసం ఎదరు చూడొద్దని జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.

ప్రధానితో భేటీ

ఢిల్లీ వెళ్లిన జగన్‌ ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్ విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

అయితే మరికాసేట్లో కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం జగన్​ కలవనున్నారు. విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read Also.. AP Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. కాబోయే కొత్త మంత్రులు వీరే..? లిస్ట్ వైరల్..!