Andhra Pradesh: ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గారి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Andhra Pradesh: ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల  సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

Updated on: Nov 20, 2021 | 10:09 AM

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గారి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కరీమున్నిసా అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగానే కరీమున్నిసా కన్నుమూశారు. గతంలో విజయవాడలోని 54వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమెకు ముస్లిం మైనార్టీలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆమెకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.

Also Read:

Fishing in Flood: చిత్తూరులో పొంగి పొర్లుతున్న చెరువులు.. చేపల కోసం జనం ఫీట్లు..! (వీడియో)

Chinese Man: నీకు తిండి పెట్టలేం బాబు.. అతడిని రెస్టారెంట్‌కు రావొద్దని వేడుకుంటున్న యాజమాన్యం..

AP Rains: కదిరిలో కుప్పకూలిన భవనం.. 4 ఇళ్లు ధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి.. శిథిలాల కిందే..