
ఏపీ బీజేపీలో మరో వివాదం మొదలైంది. నిన్నటి వరకు సోము, జీవీఎల్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తే… ఇప్పుడు ఆ పార్టీలోనే కీలక నేత పురంధేశ్వరి జీవీఎల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం దుమారం రేపుతోంది. ఎన్టీఆర్, వైఎస్‌లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు పురంధేశ్వరి. జీవీఎల్ చేసిన వ్యాఖ్యల వీడియోను అటాచ్ చేస్తూ మరీ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలేనా, ఎక్కడ చూసినా ఆ ఇద్దరి పేర్లానా అంటూ నిన్న ఎన్టీఆర్, వైఎస్ పేర్లపై వ్యాఖ్యలు చేశారు జీవీఎల్. వంగవీటి రంగా పేరు కూడా జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆ ఇద్దరూ అంటూ జీవీఎల్ అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పురంధేశ్వరి. ఆ ఇద్దరూ కాదు ఆ మహానుభావాలు అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపును తెచ్చి పేదలకు నిజమైన సంక్షేమం, రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారని ట్వీట్ చేశారు పురంధేశ్వరి. వైఎస్‌ఆర్ ఫీజు రీఎంబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీని అందించారని గుర్తు చేశారు.
ఆ ఇద్దరూ అంటూ ఎన్టీఆర్, వైఎస్‌లను ఉద్దేశించి జీవీఎల్ పేర్కొనడాన్ని ఈ రకంగా, చాలా సీరియస్‌గా పురంధేశ్వరి రియాక్ట్ అవడం బీజేపీలోనే చర్చనీయాంశమైంది.
“అన్నీ ఇద్దరి పేర్లేనా”
ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు pic.twitter.com/bFPSbCBKV1
— Daggubati Purandeswari ?? (@PurandeswariBJP) February 17, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..