స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడును నేర పరిశోధన విభాగం (సీఐడీ) శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. నంద్యాల ఆర్.కే. ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబర్ 29/2021 కేసులో అరెస్ట్ చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. 120(B), 166, 167, 418, 420, 465, సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. 468, 471, 409, 201,109 రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ చట్టంలోని 12, 13(2) రెడ్ విత్ (1) (c)(d) సెక్షన్లను పోలీసులు చంద్రబాబుపై నమోదు చేశారు. 2021 డిసెంబర్ 9న 25 మందిని నిందితులుగా పేర్కొంటూ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాబు అరెస్ట్‌పై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.
ఇవి కూడా చదవండి— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) September 9, 2023
చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ ఖండిస్తుందన్నారు పురంధేశ్వరి. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదన్నారు. చంద్రబాబు అరెస్టును బిజెపి ఖండిస్తుందంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు పురంధరేశ్వరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..