AP AYUSH: ఆనందయ్యకు ఏపీ ఆయుష్ శాఖ ఝలక్.. అందుకు అనుమతి లేదని స్పష్టీకరణ

ఒమిక్రాన్ కు ఆయుర్వేదం మందు ఇస్తామని కొందరు చెపుతున్న నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాక క్లారిటీ ఇచ్చింది.

AP AYUSH: ఆనందయ్యకు ఏపీ ఆయుష్ శాఖ ఝలక్.. అందుకు అనుమతి లేదని స్పష్టీకరణ
Anandayya's Covid medicine

Updated on: Dec 24, 2021 | 6:58 PM

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కోసం స్పెషల్ మందు తయారు చేస్తున్నట్టు మొన్ననే చెప్పారు ఆనందయ్య. అంతలోనే షాక్ ఇచ్చింది ఆయుష్ శాఖ. కరోనాకు, ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మందు ఇస్తామని తమనెవరూ సంప్రదించలేదని అధికారులు ప్రకటించారు. అలాంటి గుర్తింపులేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్‌గా భావించొద్దని ఆయుష్‌ శాఖ స్పష్టంచేసింది. ఒమిక్రాన్ కు ఆయుర్వేదం మందు ఇస్తామని కొందరు చెపుతున్న నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాక క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ కు ప్రభుత్వం ఆయుర్వేద మందుకు అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఆర్సెనిక్ ఆల్బమ్, ఆయుష్ – 64 మాత్రమే ఆయుష్ ప్రతిపాదిత మందులని వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ఆయుష్ శాఖ ప్రతికా ప్రకటన విడుదల చేసింది.

“ఒమిక్రాన్ వైరస్ ద్వారా సంక్రమించే కరోనా వ్యాధిని నిరోధించే ఆయుర్వేద మందును అందించగలమని కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నట్లు ఆయుష్ శాఖ దృష్టికి వచ్చింది. కనుక ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఒమిక్రాన్ వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని..ఏ ఆముర్వేద మందును ప్రభుత్వం అనుమతించలేదు. ఒమిక్రాన్‌ను నివారించే.. ఏ ఆయుర్వేద మందు ఉచిత సరఫరాకు గానీ, అమ్మకానికి కానీ ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి ఇటువంటి గుర్తంపు లేని వ్యక్తుల ద్వారా అందిచబడే మందును.. ఆయుర్వేద మందుగా భావించి నష్టపోకుండా ఉండేందుకు ప్రజలకు ఈ సమాచారం తెలియజేయటమైనది. ప్రభుత్వ గుర్తింపు పొందిన కోవిడ్ 19 నిరోధకాలైన..AYUSH-64 లాంటి ఆయుర్వేద మందులను..Arsenic Album-30C లాంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ద్వారానూ..వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానూ, మాస్కుల ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారానూ కోవిడ్-19 నుంచి రక్షణ పొందవచ్చు” అని ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.

Also Read: సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

కారులో దర్జాగా వచ్చి ఇతగాడు ఏం దొంగతనం చేశాడో తెలిస్తే కంగుతింటారు