Producer Annamreddy Krishna Kumar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ గుండెపోటుతో మృతి

తెలుగు సినీ పరిశ్రమ మరొకరిని కోల్పోయింది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖుల వరుస మరణవార్తలతో టాలీవుడ్‌లో విషాద వాతావరణం నెలకొంది.

Producer Annamreddy Krishna Kumar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ గుండెపోటుతో మృతి
Anukoni Athidi Film Producer Annam Reddy Krishna Kumar

Updated on: May 26, 2021 | 9:33 AM

Producer Annamreddy Krishna Kumar: తెలుగు సినీ పరిశ్రమ మరొకరిని కోల్పోయింది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖుల వరుస మరణవార్తలతో టాలీవుడ్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇప్పటికే పరిశ్రమలో పేరు పొందిన గాయకుడు జి.ఆనంద్‌, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌జీతో పాటు రచయిత నంద్యాల‌ రవి, నటుడు టీఎన్‌ఆర్‌, పీఆర్వో బీఏ రాజుల వరుస మరణాలతో చిత్రపరిశ్రమలో తీరని లోటు ఏర్పడిన సంగతి తెలిసిందే.

తాజాగా నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ కన్నుమూశారు. విశాఖలో ఉంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు.  ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. సాయిపల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కృష్ణకుమార్‌ మృతిచెందడంతో చిత్రబృందమే కాకుండా మొత్తం టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Read Also…. Coronavirus: వైద్యరంగంపై కరోనా పంజా.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో 513 మంది వైద్యుల బలి..