Andhra: చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా అధికారులే బిత్తరపోయారు

చిరుతిళ్లు తింటున్నారా..? అయితే ఆస్పత్రి లో బెడ్‌ రెడీ చేసుకోండి. గోదావరి జిల్లాల జనానికి హెచ్చరిక..! దారుణమైన నిజాలు మీ కళ్ల ముందుకు తెస్తున్నాం.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీ లో తెలుసుకుందామా. ఓ సారి ఇది లుక్కేయండి. అదేంటంటే..

Andhra: చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా అధికారులే బిత్తరపోయారు
Andhra News

Updated on: Feb 04, 2026 | 2:04 PM

ఏలూరు సమీప ప్రాంతాల్లో పశువుల కొవ్వుతో నూనె తయారీ జరుగుతోందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు అల‌ర్ట్ అయ్యారు. తంగెళ్లమూడి, ఆదివారపుపేట, లంకపేట ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద కార్యకలాపాలు బయటపడ్డాయి. పశువుల కొవ్వు, ఎముకలను మరిగించి వచ్చిన చమురుతో నూనె తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన నూనెను తక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నారు. దాడుల్లో అమ్మడానికి రెడీగా ఉన్న 350 కేజీల నూనెను అధికారులు సీజ్‌ చేశారు.. రెండు ఇళ్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన నూనె బయటపడింది.

ఈ వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా కల్తీ నూనె తయారు చేసి విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కల్తీ ఆయిల్‌తో ఆరోగ్యానికి ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తతాయని హెచ్చరిస్తున్నారు. కాసుల క‌క్కుర్తీ కోసం ఇలా కొంద‌రు క‌ల్తీ గాళ్లు ప్ర‌తీ వ‌స్తువును న‌కిలీ చేస్తున్నారు. ప్రజ‌ల ప్రాణాలు పోయినా స‌రే త‌మ జేబులు నిండాల‌ని చూస్తున్నారు. ఏలూరులో వెలుగులోకి వ‌చ్చిన క‌ల్తీ నూనె వ్యవ‌హారం గోదారోళ్లను ఉలిక్కిప‌డేలా చేసింది.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..