Kadapa District: అంగన్వాడీ బియ్యం కల్తీ..! నానబెట్టిన కొద్దిసేపటికే… పైకి తేలిన రైస్

|

Jul 15, 2021 | 8:51 AM

అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పంపిణీ చేసిన బియ్యం కల్తీ అయిన సంఘటన కడప జిల్లా కలకలం రేపింది. పంపిణీ చేసిన దాంట్లో..

Kadapa District:  అంగన్వాడీ బియ్యం కల్తీ..! నానబెట్టిన కొద్దిసేపటికే... పైకి తేలిన రైస్
Fake Rice In Kadapa
Follow us on

అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పంపిణీ చేసిన బియ్యం కల్తీ అయిన సంఘటన కడప జిల్లా కలకలం రేపింది. పంపిణీ చేసిన దాంట్లో.. ప్లాస్టిక్ బియ్యం రావడంతో… గ్రామస్తులు లబోదిబోమన్నారు. ఆఖరికి గర్భిణులకు ఇచ్చే ఐటెమ్స్ కూడా కల్తీ చేస్తారా… అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ గ్రామ ప్రజలు. పంపిణీదారులు ఇలా చేస్తుంటే… ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాంచ్ చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని అంగన్వాడీ ద్వారా… ఈనెల ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం కల్తీ అయ్యాయి. పంపిణీ చేసిన దాంట్లో ప్లాస్టిక్ బియ్యం రావటంతో… బియ్యాన్ని ప్రజలు పరిశీలించారు. ఆ బియ్యాన్ని నానబెట్టిన కొద్దిసేపటికి… రైస్‌పైకి తేలింది. పట్టుకోని చూడగా… బంకలాగా సాగుతున్నాయని గ్రామస్తులు చెప్పారు. వీటిని తింటే పరిస్థితి ఏంటని పిల్లల తల్లులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాడమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామస్తులు ఈ విషయాన్ని అధికారులకు, మీడియాకు తెలిపారు. అక్కడికి వెళ్లి బియ్యాన్ని పరిశీలించగా… కల్తీ జరిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక అంగన్వాడీ టీచర్‌కు తెలియజేస్తామంటే ఆమె అందుబాటులో లేదని గ్రామస్తులు చెప్పారు. దీంతో మండల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా… ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి సమాచారం లేదని… ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తామని ఎమ్మార్వో స్పష్టం చేశారు. ఉప్పరపల్లి గ్రామానికి వెళ్లి పూర్తి విచారణ చేపడతామని తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి తెలిపారు.

Also Read:  ఏపీలో ప్లాస్టిక్ భూతం.. పశువులు, పక్షులు పాలిట యమపాశంలా మారిన వైనం

ఆ జిల్లాల్లో పదునైన ఆయుధాలపై మరో 6 నెలలు నిషేధం పొడిగింపు