Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు బంపర్ ఆఫర్.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..

Tokyo Olympics 2020: ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్ కీలక ప్రకటన విడుదల చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య సాధించిన పీవీ సింధుకు నగదు బహుమానం..

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు బంపర్ ఆఫర్.. కీలక ప్రకటన చేసిన ఏపీ సర్కార్..
Cm Jagan

Updated on: Aug 03, 2021 | 7:44 AM

Tokyo Olympics 2020: ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్ కీలక ప్రకటన విడుదల చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య సాధించిన పీవీ సింధుకు నగదు బహుమానం ప్రకటించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. సింధు విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధుకు నగదు పోత్సాహకం అందిస్తామని చెప్పారు. అలాగే.. క్రీడల్లో ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందని చెప్పారు.

అంతేకాదు.. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్రాహకాలు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ. 75 లక్షలు, రజత పథకం సాధించిన వారికి రూ. 50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి 30 లక్షల రూపాయల నగదును ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.

2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి కూడా జాతీయ సీనియర్, సబ్‌జూనియర్‌ స్థాయిల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నగదును ఇచ్చామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే స్పోర్ట్స్‌పాలసీ ప్రకారం నగదు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఇక పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణకోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లేముందు సింధుతోపాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం అందజేశారు.

Also read:

Aeroplane spare parts: విమాన విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్‌..!

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. అనుమానితుడు సునీల్ కుమార్ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలనాలు!

RRR Movie: దోస్తీ సాంగ్ ఫుల్ క్రెడిట్ మొత్తం అతనిదే.. కొడుకుపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..