SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

SSC, Inter Eaxm: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో విద్యార్థులు,.

SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

Updated on: Apr 30, 2021 | 12:29 PM

SSC, Inter Eaxms: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున ఆందోళనలో ఉన్నారని, కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలపై పునరాలోచించాలని పేర్కొంది. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే.. మీరు ఎలా నిర్వహించాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ మే 3వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Photo Viral: ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితుడిని చూసి ఆశ్యర్యపోయిన కలెక్టర్‌.. ఆయన చేసిన పనికి ఫిదా.. ఫోటో వైరల్‌

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం.. ఎందుకంటే..!