AP Panchayat Elections: ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొల్పేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2వేల నుంచి 5 వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5 వేల నుంచి 10 వేల జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేలు దాటినట్లయితే రూ.20 లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది.