AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

|

Apr 30, 2021 | 7:37 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపడుతున్నా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి....

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Ap Corona
Follow us on

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపడుతున్నా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 86,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 17,354 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇక తాజాగా కరోనా బారిన 64 మంది మృతి చెందినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల 11,01,690కి చేరగా, 7992 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 9,70,718 మంది కోలుకోగా, 1,22,980 యాక్టివ్‌ కేసులకు చేరాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,63,90,360 శాంపిళ్లను పరీక్షించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో 8 మంది, విశాఖలో 8, విజయనగరంలో 7, చిత్తూరులో 6, తూర్పు గోదావరిలో 6, ప్రకాశంలో 6, అనంతపురంలో 5, గుంటూరులో 4, కర్నూలులో 4, పశ్చిమగోదావరిలో 4, కృష్ణాలో 3, శ్రీకాకుళంలో 3 చొప్పున కరోనాతో మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,22,980 ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులు..

అనంతపురంలో 1882, చిత్తూరు – 2764, వెస్ట్‌ గోదావరి -1842, గుంటూరు -2129, కడప – 757, కృష్ణా – 698, కర్నూలు – 967, నెల్లూరు – 1133, ప్రకాశం – 661, శ్రీకాకుళం -1581, విశాఖ – 1358, విజయనగరం – 740, ఈస్ట్‌ గోదావరి – 842 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మాస్కు ధరించకుండా బయట కనిపించే వారికి జరిమానా విధిస్తున్నారు అధికారులు. అలాగే కరోనా కేసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపడుతున్నారు.

ఇక ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందేలా చర్యలు చేపడుతోంది. అలాగే కరోనా పరీక్షలను సైతం వేగవంతం చేసింది. ప్రైవేటులో కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటే అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు చేపట్టింది. అధిక ఫీజులు వసూలు చేసేవారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బెడ్ల కొరత లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

 

ఇవీ కూాడా చదవండి

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు రైళ్లు పొడిగింపు.. మరికొన్ని సర్వీసులు రద్దు..!

Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..