CM Jagan Emergency Meeting: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అత్యవసర సమావేశం.. హైకోర్టు కీలక తీర్పుపై చర్చ

CM Jagan Emergency Meeting: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు పార్టీ సీనియర్‌ నేతలతో...

CM Jagan Emergency Meeting: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అత్యవసర సమావేశం.. హైకోర్టు కీలక తీర్పుపై చర్చ
Andhrapradesh CM YS Jagan

Updated on: Jan 21, 2021 | 4:42 PM

CM Jagan Emergency Meeting: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, బోత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పుపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలి.? సుప్రీం కోర్టుకు వెళ్లాలా.. వద్దా.. లేకుంటే షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలా..అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమావేశం ముగిశాయ మంత్రి పేర్ని నాని లేదా కొడాలి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశానికి సంబంధించి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేయగా, ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని, ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కీలక తీర్పుపై ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు స్పందిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మరో వైపు బీజేపీ, టీడీపీ ప్రముఖ నేతలు మాత్రం ఈ తీర్పును స్వాగతించారు. ఇదిలా ఉండగా, ఏపీ సర్కార్‌ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పున సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని అన్నారు. తాము అనుకున్నవిధంగా హైకోర్టులో తీర్పు రాలేదని, ఉద్యోగుల్లో కరోనా భయం ఇంకా పోలేదని అన్నారు.

Also Read:

Also Read: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేయడమే చంద్రబాబు లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

Chandra Babu: డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై చంద్రబాబు కన్నెర్ర.. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి అంటూ నిలదీత