Andhra Pradesh: గ్రామ వాలంటీర్ దారుణ హత్య.. తనను దూరం పెట్టిందనే కారణంతోనే..

Andhra Pradesh: బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని చావలిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్‌ను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు.

Andhra Pradesh: గ్రామ వాలంటీర్ దారుణ హత్య.. తనను దూరం పెట్టిందనే కారణంతోనే..
Village Volunteer

Updated on: May 15, 2022 | 10:59 PM

Andhra Pradesh: బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని చావలిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్‌ను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న దొప్పలపూడి శారదా(30) అనే మహిళను అదే గ్రామానికి చెందిన మద్ది పద్మారావు అనే వ్యక్తి కత్తితో అతి దారుణంగా నరికి చంపాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్నేళ్ళుగా శారదకు, పద్మారావుకు వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయంపై పలుమార్లు భర్తతో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే శారద పద్మారావును దూరం పెట్టింది. అయినా పద్మారావు.. శారదను తనతో కలిసి ఉండాలని తరుచూ గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సమయంలో శారద తన ఇల్లు శుభ్రం చేస్తుండగా పద్మారావు శారదను కత్తితో మెడపై పలుమార్లు నరికాడు. శారద చెయ్యి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంత దూరం వెళ్ళిన శారద తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇవి కూడా చదవండి

మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని రిమాండ్ పంపిస్తామని తెలిపారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన ఆయన.. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవని, కేవలం వివాహేతర సంబంధం నేపథ్యంలో మాత్రమే హత్య జరిగిందని వెళ్లడించారు. కాగా, మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us