Andhra Pradesh: కథం తొక్కిన ఏపీ నిరుద్యోగ యువత.. జాబ్ క్యాలెండర్ కోసం మహా ధర్నా

|

Mar 12, 2022 | 3:52 PM

AP Job Calender: ఆంధ్ర ప్రదేశ్‌లో నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం కథం తొక్కారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ

Andhra Pradesh: కథం తొక్కిన ఏపీ నిరుద్యోగ యువత.. జాబ్ క్యాలెండర్ కోసం మహా ధర్నా
Ap Students Jac Protest
Follow us on

AP Job Calender: ఆంధ్ర ప్రదేశ్‌లో నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం కథం తొక్కారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎక్కడికక్కడ విద్యార్థి నేతలు, నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాలను ఎక్కడికక్కడ నిలువరించారు. ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని నిరసిస్తే జైల్లో పెట్టడమేంటని విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అఖిలపక్ష విద్యార్థి జేఏసీలో భాగమైన పలు విద్యార్థి సంఘాలు ఈ మహా ధర్నాలో పాలుపంచుకున్నాయి.  ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్ష విద్యార్థి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త మహా ధర్నాలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్లు కూడలి వద్ద చెవిలో పూలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు టీడీపీ తెలుగు యువత. జాబ్ క్యాలండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. ఎన్నికల హామీలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖలో…

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ను వెంటనే రిలీజ్ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని విశాఖలో టీడీపీ తెలుగు యువత ఆంధోళనకు దిగింది. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.

Also Read..

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Redmi Note 11 Pro: రెడ్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. 108 మెగా పిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..