AP Weather: ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్..

|

Nov 14, 2024 | 7:01 PM

నవంబర్ 15, శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

AP Weather: ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్..
Andhra Weather Report
Follow us on

నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతములో నున్న బుధవారం నాటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తమిళనాడు & పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య / తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

గురువారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం, శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

గురువారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం, శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

గురువారం, శుక్రవారం, శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..