Watch Video: SBI బ్యాంకులో చోరీకి దొంగ విఫలయత్నం.. సీసీ కెమెరాలో కనిపించికుండా..

|

May 08, 2023 | 3:20 PM

బ్యాంకులో దొంగతనానికి పక్కా ప్లాన్ చేశాడు..అనుకున్నట్లుగానే ఎస్‌బీఐ బ్యాంక్‌లో దూరాడు.. సీసీ కెమెరాలో ఫేస్‌ కనిపించకుండా గొడుగు అడ్డు పెట్టుకున్నాడు.. నగదు నగలు దాచే స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లాడు..

బ్యాంకులో దొంగతనానికి పక్కా ప్లాన్ చేశాడు..అనుకున్నట్లుగానే ఎస్‌బీఐ బ్యాంక్‌లో దూరాడు.. సీసీ కెమెరాలో ఫేస్‌ కనిపించకుండా గొడుగు అడ్డు పెట్టుకున్నాడు.. నగదు నగలు దాచే స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లాడు..అలా డోర్‌ టచ్‌ చేశాడో లేదో ఇలా అలారం మోగింది.. అంతే ఖంగారుగా చోరీ చేసేందుకు తీసుకొచ్చిన పనిముట్లను విడిచిపెట్టి అక్కడ నుంచి జారుకున్నాడు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి SBIలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ తతంగమంతా బ్యాంకులోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి.

ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను చెక్‌ చేశారు.అందులో దొంగ గొడుగు దృశ్యాలు కనిపించాయి. అయితే గొడుగుతో గతంలోనూ ఇదే తరహాలో ప్రవేశించాడు ఓ దొంగ. ఒక్కడే పదేపదే ఇలా బ్యాంకు చోరీకి ఎత్తిస్తున్నాడా..? మరో వ్యక్తి ఎవరైనా ఇలా ప్రయత్నిస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..