Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

రుతుపవనాలు చురుకుగా మారాయి.. దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. వీటితోపాటు.. ద్రోణి, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నాయి. వీటి ప్రభాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈదురు గాలులతోపాటు భారీ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Rain Alert

Updated on: Jul 19, 2025 | 1:59 PM

రుతుపవనాలు చురుకుగా మారాయి.. దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. వీటితోపాటు.. ద్రోణి, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నాయి. వీటి ప్రభాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి తూర్పు-పశ్చి గాలుల ద్రోణి దాదాపుగా13° ఉత్తర అక్షాంశము వెంబడి విస్తరించి ఈరోజు దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. నిన్నటి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో నున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి.. ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఈరోజు తక్కువగా గుర్తించబడినది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రాయలసీమ :-

శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో భారీ వర్షాలు..

రుతుపవన ద్రోణి, తూర్పు పశ్చిమ ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు రాగల 3 రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..