AP – Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని టాప్-9 పల్లె వార్తలు ఇవే…

|

Nov 12, 2022 | 9:25 AM

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల హల్‌చల్.. కర్నూల్ మార్కెట్‌లో పడిపోయిన టమాటా ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. టాప్ -9 పల్లె వార్తలు చదివేద్దాం పదండి.. .

AP - Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని టాప్-9 పల్లె వార్తలు ఇవే...
Village News
Follow us on
  1. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఏనుగుల హల్‌చల్ మొదలైంది. జిల్లాలోని L.N.పేట మండలంలో స౦చరిస్తూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నాయి.దా౦తో అటవిశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.ఏనుగుల స౦చార౦ పై నిఘా పెట్టారు.చొర్ల౦గి ప౦చాయితీ పరిధిలోని గిరిజన గ్రామా ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
  2. అటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించాయి..కొమరాడ మండలం కల్లికోటకు చెందిన వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందాడు..గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో ఏనుగులు సంచరిస్తున్నాయని, ఇప్పటివరకు ఏనుగుల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో అటవీశాఖ అధికారులు వెంటనే వాటిని పట్టుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు..
  3. చదువు లేని వారికి సైతం చట్టాల గురించి సులభంగా తెలుసుకునేందుకు కర్నూలు జిల్లా న్యాయమూర్తులు గ్రామాలకు వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈజీగా అర్థమయ్యేలా భూ వివాదాలు వాటి పరిష్కారాలు, భీమ, డ్రైవింగ్ లైసెన్స్, నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు చట్టపరంగా పరిష్కారాలు లాంటి అనేక అంశాలపై వివరిస్తున్నారు.
  4. తిరుమలలో భారీ వృక్షం నేలకూలింది..ఆస్థన మండపం వద్ద ఉన్నట్టుండి పెద్ద చెట్టు కిందపడిపోయింది..దీంతో కారు ధ్వంసమైంది..అయితే ఈ ప్రమాదం అర్థరాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది..కానీ రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు..దీంతో రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది చెట్టు తొలగించారు..
  5. గత కొన్ని రోజులుగా టమోటా ధర భారీగా పడిపోయింది. ఒకవైపు దిగుబడి పెరిగిపోవడం, మరోవైపు వర్షాల కారణంగా విక్రయాలు పడిపోవడంతో ఈ వీటి ధరలు గణనీయంగా తగ్గిపోయాయి.దీంతో కర్నూలు మార్కెట్‌లో కిలో టమోటాల ధర 2 నుంచి 5 రూపాయిలు పలుకుతోంది.దీంతో రైతులు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
  6. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్ళచెరువులో విత్తన కంపెనీ ప్రతినిధులను రైతులు నిర్భంధించారు. పొలాలను పరిశీలించేందుకు వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులను పంపించిన రైతులు.. గంగా కావేరి కంపెనీ ప్రతినిధులను నిర్బంధించారు. సమస్య పరిష్కారించే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు.
  7. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం స్కూల్‌ టీచర్లు వినూత్న ఆలోచన చేశారు..పిల్లలకు ఈజీగా అర్థం అయ్యేలా విద్యాభోధన చేస్తున్నారు..సబ్జెక్ట్ పై విద్యార్థులకు మరింత పట్టు దొరికేలా విద్యార్థులకు సబ్జెక్టు పరంగా అవగాహన కల్పిస్తున్నారు..ఉపాధ్యాయుల వినూత్న ప్రయత్నానికి విద్యార్థులు ఫిదా అయ్యారు..
  8. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు..కార్తీకమాసం శనివారం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయం..ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసే భక్తుల గోవింద నామ స్మరణలతో స్వామివారి ఆలయం మారుమోగుతుంది..స్వామివారి దర్శనం కోసం రెండు గంటల నుంచి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు భక్తులు..
  9. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.మంచు కారణంగా రోడ్లు కనబడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు వీపరీతంగా పడిపోయాయి.దాంతో చలికి ఏజెన్సీ మండలాల ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు పలు గ్రామాలను పొగ మంచు కమ్మేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..