Andhra Pradesh: వామ్మో..వీళ్లు మహా ముదుర్లు..! కాంబోడియా టూ అనంతపురం వయా ఢిల్లీ..!

దాదాపు 13 ఫేక్ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు బదలాయించడంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లు.. ఢిల్లీలో సైబర్ నేరగాడితోపాటు.. మొత్తం ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఇలా ఫేక్ యాప్‌లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించి.. ఆ డబ్బంతా వివిధ బ్యాంక్ అకౌంట్లకు బదలాయించి.. క్రిప్టో కరెన్సీ ధర కాంబోడియా దేశానికి కొల్లగొట్టిన డబ్బు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావటం దాదాపు అసాధ్యం..!

Andhra Pradesh: వామ్మో..వీళ్లు మహా ముదుర్లు..! కాంబోడియా టూ అనంతపురం వయా ఢిల్లీ..!
Cyber Crime

Edited By:

Updated on: Aug 02, 2025 | 9:00 AM

మీ మొబైల్‌లో ఉన్న యాప్స్ సేఫేనా? ప్రధానంగా మనీ ఇన్వెస్ట్‌మెంట్స్ లాంటి యాప్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త..! మా యాప్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. రెట్టింపు సొమ్ము ఇస్తామని ఆశ చూపి… కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఫేక్ యాప్స్ బాగోతాన్ని అనంతపురం జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. కాంబోడియా టూ అనంతపురం వయా ఢిల్లీ మీదుగా నకిలీ యాప్‌ల బండారాన్ని బయటపెట్టారు అనంత పోలీసులు. నిత్యం మీ మొబైల్ లో యూస్ చేసే యాప్ లు కూడా ఫేక్ అయి ఉండొచ్చు అంటున్నారు సైబర్ ఎక్స్‌ఫర్ట్స్.

చదువుకున్నవాడి కంటే సామాన్యుడు మేలు అన్న సామెత మీరు వినే ఉంటారు. ఎస్.. పదో తరగతి కూడా చదవని కేటుగాళ్లు ఏకంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నే మోసం చేశారు. ఏకంగా కోటి 74 లక్షల రూపాయలు కొట్టేశారు. ఎక్కడో కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లు ఆపరేట్ చేస్తుంటే.. ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా మోసం చేసి.. డబ్బులు ఫేక్ అకౌంట్లోకి బదలాయించారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠాలు అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

రాయదుర్గం పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. మనీ ఇన్వెస్ట్ చేసేందుకు సోషల్ మీడియాలో.. ఎక్కడ డబ్బు పెట్టుబడి పెడితే లాభసాటిగా ఉందని సెర్చ్ చేశాడు. ఓ ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేస్తే ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నమ్మించారు. ఫేక్ యాప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయించారు.

సైబర్ నేరగాళ్ల మాయలో పడ్డ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తొలుత రూ. 12 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కొద్ది రోజుల్లోనే 12 లక్షల ఇన్వెస్ట్‌మెంట్లకు.. 5,50,000 రూపాయల లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకునే విధంగా సైబర్ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నమ్మించారు. దీంతో లక్షల్లో లాభం వస్తుందని నమ్మకం పెరగడంతో నెల రోజుల వ్యవధిలోని ఏకంగా కోటి 74 లక్షల రూపాయలు ఫేక్ యాప్‌లో ఇన్వెస్ట్ చేశాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇన్వెస్ట్ చేసిన మొత్తం… అదేవిధంగా వచ్చిన లాభం కలిపి దాదాపు మూడున్నర కోట్లు యాప్ లో చూపించడంతో… ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. డబ్బులు విత్ డ్రా అవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించాడు.

అన్ని సైబర్ నేరాల్లో కాకుండా అనంత పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని 40 రోజులపాటు శ్రమించి కేసును ఛేదించారు. విచారణలో తెలిసిందేంటంటే.. అసలు మనం రెగ్యులర్‌గా ఉపయోగించే చాలా యాప్‌లకు.. కొద్దిగా అటు ఇటుగా అక్షరం మార్పుతో నకిలీ యాప్‌లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని పోలీసులు విచారణలో తేలింది. ఈ నకిలీ యాప్‌లు కంబోడియా దేశంలో ఆపరేట్ అవుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా భావనేష్ గోయల్ అనే సైబర్ నేరగాడు కమిషన్ ఆశ చూపి బ్యాంక్ అకౌంట్ ను పెద్దగా ఉపయోగించని వారి బ్యాంక్ అకౌంట్లోకి ఫ్రాడ్ డబ్బంతా బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అలా దాదాపు 13 ఫేక్ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు బదలాయించడంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లు.. ఢిల్లీలో సైబర్ నేరగాడితోపాటు.. మొత్తం ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఇలా ఫేక్ యాప్‌లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించి.. ఆ డబ్బంతా వివిధ బ్యాంక్ అకౌంట్లకు బదలాయించి.. క్రిప్టో కరెన్సీ ధర కాంబోడియా దేశానికి కొల్లగొట్టిన డబ్బు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావటం దాదాపు అసాధ్యం..! కానీ ఈ నకిలీ యాప్ కేసులు పోలీసులు 13 బ్యాంక్ అకౌంట్ లను గుర్తించి దాదాపు 40 లక్షల రూపాయలు నగదును రికవరీ చేశారు.

నిందితుల వద్ద క్యూఆర్ కోడ్ స్కానర్లు, బ్యాంక్ పాస్ బుక్కులు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నకిలీ యాప్ లను ఆపరేట్ చేస్తున్న కింగ్ పిన్ కాంబోడియా దేశంలో ఉన్నాడని, ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్న ముఠాను పట్టుకోవడంతో.. కాంబోడియా నుంచి ఆపరేట్ అవుతున్న నకిలీ యాప్‌లతో సంబంధాలు తెంచామని పోలీసులు చెబుతున్నారు. మీ మొబైల్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు సేఫేనా అంటే.. కాదు అంటున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. ఆర్‌బీఐ, చెబి గుర్తింపు పొందిన యాప్‌లకు ఏం మాత్రం తీసిపోకుండా ఈ నకిలీ యాప్‌లు పుట్టుకు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..