Heat Wave: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అలర్ట్‌.. రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్‌..

|

Mar 28, 2022 | 5:59 PM

Heat Wave: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ వడ గాలులు తీవ్రమవుతున్నాయి. ఇంకా మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని...

Heat Wave: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అలర్ట్‌.. రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్‌..
Heat Wave
Follow us on

Heat Wave: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ వడ గాలులు తీవ్రమవుతున్నాయి. ఇంకా మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అలర్ట్‌ చేసింది. సోమవారం రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో వడగాలులు వీచాయి, రానున్న రెండు రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుందన్న వివరాలను ప్రకటించింది..

* సోమవారం (28-03-2022)న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో విశాఖపట్నంలో 05 మండలాలు, కడపలో 04, కర్నూలులో 08 మండలాలు ఉన్నాయి.

* రాగల 24 గంటల్లో (29-03-2022) రాష్ట్రంలో 04 మండలాల్లో, 74 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని 4 మండలాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

* రానున్న 48 గంటల్లో (30-03-2022) రాష్ట్రంలోని 2 మండలాల్లో తీవ్ర వేడి గాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో తీవ్ర వడగాలులు వీయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా ఏయే మండలాల్లో తీవ్రవడగాల్పులు, వడగాల్పులు, వడ గాల్పుల ప్రభావం లేని ప్రాంతాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Summer Drinks: వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ 5 దేశీ డ్రింక్స్‌ సూపర్..!

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం?

Casino row: గుడివాడలో రాజ్యాంగం అమలవుతోంది.. అక్రమ క్యాసినో నిగ్గు తేల్చండి.. కొడాలి నానిపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ