AP Rains: అటు వర్షాలు.. ఇటు వడగాల్పులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. పూర్తి వివరాలు

ఏపీలో వచ్చే 3 రోజులు తేమ, పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని చెప్పింది. మరి వచ్చే 3 రోజులు వాతావరణ విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా

AP Rains: అటు వర్షాలు.. ఇటు వడగాల్పులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. పూర్తి వివరాలు
Ap Rains

Updated on: Mar 25, 2025 | 8:36 PM

బుధవారం (26-03-25) శ్రీకాకుళం జిల్లా -15, విజయనగరం జిల్లా-21, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3, తూర్పుగోదావరి-13, ఏలూరు-5, కృష్ణా -2 ఎన్టీఆర్-6, గుంటూరు-3, పల్నాడు-8 మండలాల్లో వడగాల్పులు (108) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.

ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్‌ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా

మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.1°C, నెల్లూరు జిల్లా సోమశిలలో 40.9°C, అన్నమయ్య జిల్లా పూతనవారిపల్లి, చిత్తూరు జిల్లా పిపల్లి, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 40.1°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే 15 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.

ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us