AP Weather Report: ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!

|

Sep 06, 2021 | 4:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాగల మూడు రోజుల వరకూ వాతావరణ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రము సంచాలకులు కొంచెం సేపటి క్రితం

AP Weather Report:  ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
Follow us on

AP Weather : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాగల మూడు రోజుల వరకూ వాతావరణ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రము సంచాలకులు కొంచెం సేపటి క్రితం వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు సహా పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలకు పూనుకుంటోంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :

> ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

> రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

> ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

> ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు; నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

> రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

> ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

> ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. అనంతపురం కర్నూలు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

> ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

Read also: AP CM YS Jagan: “అప్పట్లోగా రోడ్లు రెడీ చేయండి”.. అధికారులను ఆదేశించిన సీఎం జగన్