Andhra Pradesh: జంగారెడ్డిగూడెంలో వరుస చావుల కలకలం.. కొన్ని రోజుల వ్యవధిలోనే 18 మంది మృతి

Mysterious Deaths: కల్తీ కల్లు కాదు.. ఏ రోగం లేదు.. ఐనా వరుస మరణాలు ఆగడం లేదు. కారణం ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Andhra Pradesh: జంగారెడ్డిగూడెంలో వరుస చావుల కలకలం.. కొన్ని రోజుల వ్యవధిలోనే 18 మంది మృతి
Death

Updated on: Mar 12, 2022 | 4:25 PM

Mysterious Deaths: కల్తీ కల్లు కాదు.. ఏ రోగం లేదు.. ఐనా వరుస మరణాలు ఆగడం లేదు. కారణం ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస చావులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే 18 మంది మ‌ృతి చెందారు.  మొదట కల్తీ కల్లు తాగి వీరు చనిపోయారని భావించారు. ఎక్కడా కల్తీ కల్లు ఆనవాళ్లు కనిపించలేదు. ఈ వరుస మరణాలపై అసెంబ్లీలో కూడా తీవ్ర మైన చర్చ జరిగింది. అయితే వరుస మరణాలకు కారణాలు ఏంటో  అధికార యంత్రాంగానికి, వైద్య నిపుణులకు అంతుచిక్కడం లేదు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు వరుస మరణాలకు కారణాలపై ఆరా తీస్తున్నాయి. అటు జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ సైతం ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు.

ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను అక్కడికి పంపింది. తీరా వైద్యులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో సంచలన నిజాలు బయట పడ్డాయి. చనిపోయిన వారిలో ఒక్కో వ్యక్తి ఒక్క రకమైన కారణాలతో చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కిడ్నీల సమస్యతో వస్తున్న సైడ్‌ ఎఫెక్ట్‌ వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. అందుకు మద్యం తాగడం వల్ల దాని ప్రభావం కిడ్నీలపై పడుతుందని తేలుతోంది.

జంగారెడ్డిగూడెం ఇప్పటికే ఏకంగా 18 మంది ఇటీవల కాలంలో చనిపోయారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఒక్క రోజే ఇద్దరు మృతి చెందారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతూ వెంపల అనిల్ కుమార్ (40), ఉపేంద్ర (30) మృతి చెందారు. వీరిలో 16 మందివి సహజ మరణాలేనని అధికారులు చెబుతున్నారు.  మృతుల్లో ముగ్గురు వ్యక్తులు గత కొంతకాలంగా మద్యానికి బానిసలైనట్లు తెలుస్తోంది. దీంతో ఖననం చేయబడ్డ ఓ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు.. దాన్ని పరీక్షలకు పంపారు.  మద్యం తాగే అలవాటే వరుస మరణాలకు కారణం కావచ్చని అధికారులు చెబుతున్నాయి.

Also Read..

జీహెచ్ఎంసీ అధికారులపై పోలీసులకు 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Viral Video: ఇదేం వింత మ్యాగీ.. పిచ్చి పీక్స్‌కు చేరిందంటోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో