Viral Video: ఇదేం వింత మ్యాగీ.. పిచ్చి పీక్స్‌కు చేరిందంటోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో ఒక మహిళ మ్యాగీతో పలు ప్రయోగాలు చేస్తున్నట్లు స్పష్టంగా చూడొచ్చు. పీచు మిఠాయితో మ్యాగీని తయారుచేసి..
మ్యాగీ(Maggi) చాలా కాలంగా చాలా మందికి ఇష్టమైన వంటకంగా మారింది. కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నచ్చుతుంది. అయితే మ్యాగీని వండేందుకు రకరకాల ప్రయోగాలు సోషల్ మీడియా(Social Media)లో ఎన్నో వీడియోలు మనకు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ మహిళ మ్యాగీ వండడాన్ని డిఫరెంట్‌గా ట్రై చేసింది. ఇలా చేసి నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈ మ్యాగీకి కాటన్ క్యాండీ(పీచు మిఠాయి) మ్యాగీ అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింత వంటకాలతో కూడిన వంటకాలు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి పీచు మిఠాయి మ్యాగీ చేసిన మహిళపై జనాలు మండిపడుతున్నారు. మ్యాగీ అభిమానులు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో, ఒక మహిళ మ్యాగీతో ఎలా ప్రయోగాలు చేస్తుందో స్పష్టంగా చూడవచ్చు. ఈ చిన్న క్లిప్‌లో, ఒక మహిళ కాటన్ మిఠాయితో మ్యాగీని తయారు చేస్తున్నట్లు చూపించింది.
ఈ వింత వంటకం చేయడానికి ఆమె మొదట ఒక బాణలిలో కొద్దిగా వెన్న వేసి, అందులో వివిధ కూరగాయలను ఫ్రై చేసింది. దీని తరువాత ఆమె ఉప్పు, నీరు, సుగంధ ద్రవ్యాలు జోడించింది. కాసేపు ఉడికిన తర్వాత అందులో కాటన్ మిఠాయిని వేసి మ్యాగీతో కరిగిపోయే వరకు కలిపింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈట్ దిస్ ఢిల్లీ అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను 2 లక్షలకు పైగా వీక్షించారు. చాలా మంది నెటిజన్లు మ్యాగీని ఇలా తయారు చేయడంతో అసంతృప్తితో ఉన్నారు. అలాగే దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇది వంటకమేనా అంటూ విమర్శలు గుప్పించారు.
View this post on Instagram
Also Read: Viral News: చెత్త కుప్పలో బ్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్! విప్పి చూస్తే ఒక్కసారిగా షాక్..
Viral Video: ఆస్కార్ రేంజ్‌లో యాక్టింగ్ చేసిన బాతు చివర్లో ట్విస్ట్ మాత్రం సూపర్..