YCP Vs TDP: సీఎం జగన్ ఉన్న ప్లెక్సీని చింపిన టీడీపీ నేతలు.. ఏడుగురిపై కేసు నమోదు..

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ సాగుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మధ్య వివాదాలు..

YCP Vs TDP: సీఎం జగన్ ఉన్న ప్లెక్సీని చింపిన టీడీపీ నేతలు.. ఏడుగురిపై కేసు నమోదు..
Andhra Pradesh News

Updated on: Nov 21, 2021 | 9:48 AM

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ సాగుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మధ్య వివాదాలు ఓ రేంజ్ లో సాగుతుంది. గత రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు  అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. కన్నీరు పెట్టారు. ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు తగదంటూ తాను ఇక అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పారు. దీంతో ఏపీలో టీడీపీ నేతలు కార్యకర్తలు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వేల్లమిల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీ చింపారని ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని టీడీపీ నేతలు చింపారు. అంతేకాదు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Also Read:  రోడ్డుపై నోట్ల జాతర.. ఎగబడి జేబులు నింపుకున్న జనం.. ఇద్దరు అరెస్ట్ .. ఎక్కడంటే..