Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి.. బెయిల్ కోసం ప్రయత్నాలు..

Andhra Pradesh: ఎమ్మెల్యే అనంతబాబు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తల్లి మంగారత్నం..

Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి.. బెయిల్ కోసం ప్రయత్నాలు..
Mlc Anantha Babu

Updated on: Aug 22, 2022 | 8:51 AM

Andhra Pradesh: ఎమ్మెల్యే అనంతబాబు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తల్లి మంగారత్నం కన్నుమూశారు. అనంతబాబు ఒక్కరే కుమారుడు కావడంతో ఆయనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కాకినాడ శ్రీరామ్‌నగర్‌లోని స్వగృహంలో అనంతబాబు తల్లి పార్థీవదేహం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టులో విచారణ జరుగనుంది. అలాగే, అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పైనా ఇవాళ కోర్టులో విచారణ జరుగనుంది. మూడోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు అనంతబాబు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు.

ఇదిలాఉండగా.. ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు వేసిన ఛార్జిషీట్‌‌ను తిరస్కరించింది రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు. ఈనెల 18న ఛార్జిషీట్‌ దాఖలు చేశారు కాకినాడ పోలీసులు. అయితే, ఆ ఛార్జిషీట్‌ అసంపూర్తిగా ఉందనే కారణంతో వెనక్కి పంపింది న్యాయస్థానం. దాంతో కాకినాడ పోలీసులు మరోసారి ఛార్జిషీట్ దాఖలు చెయ్యాల్సి ఉంది. మే 19న దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్యే అనంతబాబు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 91 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు మూడోసారి బెయిల్ పిటిషన్ వేయడం, అదే సమయంలో ఆయన తల్లి కన్నుమూయడంతో బెయిల్ మంజూరవుతుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us