Andhra Pradesh: డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు షాక్.. ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగింపు..

|

Jun 06, 2022 | 6:18 PM

Andhra Pradesh: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ హత్య కేసులో నేటితో అనంతబాబు

Andhra Pradesh: డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు షాక్.. ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగింపు..
Mlc
Follow us on

Andhra Pradesh: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ హత్య కేసులో నేటితో అనంతబాబు రిమాండ్ గడువు ముగియగా.. పోలీసులు రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారించిన కోర్టు.. అనంతబాబుకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉంటే.. అనంతబాబు బెయిల్ పిటిషన్ వేసుకోగా.. ఆ పిటిషన్‌ను కోర్టు రేపు విచారించనుంది.

వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పైగా సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకువచ్చి వారి ఇంటి వద్దే వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడంటూ కట్టుకథలు చెప్పగా.. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విషయం హత్యోదంతం వెలుగు చూసింది. సుబ్రహ్మణ్యంను చంపింది తానేనంటూ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. మరోవైపు ఈ హత్యతో వైసీపీ అలర్ట్ అయ్యింది. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కేసులో అనంతబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. న్యాయమూర్తి ఆదేశాలతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.