Gadapa Gadapaku YCP: గడపగపడకూ ప్రోగ్రామ్‌లో అరకు MLA కి ఊహించని అనుభవం ఎదురైంది. పర్సనల్ ఇష్యూలో మెడ పట్టుకుని నిలదీసింది ఓ మహిళ. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడపగపడకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు గట్టి నిరసన సెగ ఎదురైంది. అయితే, ఇది రెగ్యులర్‌గా ఎదురైన, ఎదురవుతున్న నిరసన సెగ కాదు. అంతకుమించిన పర్సనల్ ఇష్యూతో అరకు MLA చెట్టి ఫాల్గుణను నిలదీసింది ఓ కుటుంబం.
అరకులోయ మండలం మాడగడ గ్రామంలో గడపగపడకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తోన్న MLA ఫాల్గుణను ఓ మహిళ అడ్డుకుంది. మెడలో ఉన్న కండువాను పట్టుకుని తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ప్రశ్నించింది. మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా MLA ఫాల్గుణతో వాగ్వాదానికి దిగారు. మహిళ ఏకంగా MLA మెడ పట్టుకున్నంత పనిచేయడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. అయితే, తాను MLA కాకముందు ఆ స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెట్టి ఫాల్గుణ చెబుతున్నారు. తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయంటున్నారు MLA. కలెక్టర్, రెవెన్యూ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారని, ఇప్పుడు భూమి ధర పెరగడంతో రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు చెట్టి ఫాల్గుణ.