Andhra Pradesh: నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. మంత్రి విడదల రజినీ కామెంట్

రేపల్లె(Repalle) రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వరుస అత్యాచార ఘటనలతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే ఈ ఘటనపై...

Andhra Pradesh: నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. మంత్రి విడదల రజినీ కామెంట్
Rajini

Updated on: May 01, 2022 | 4:28 PM

రేపల్లె(Repalle) రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వరుస అత్యాచార ఘటనలతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించి, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో మాట్లాడి.. కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అత్యాచార ఘటనపై స్పందించారు. అత్యాచార ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారన్న మంత్రి.. నిందితులను కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టబోమని వెల్లడించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ఆదేశించినట్లు చెప్పారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు మంత్రి వివరించారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు తల్లులే కారణమంటూ హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. పిల్లలను ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లి.. ఉద్యోగం, కూలి పనులంటూ బయటికి వెళ్తుండటంతో పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని, అదే అలుసుగా భావించిన ఇరుగుపొరుగు వారు, బంధువులు, పలు సందర్భాల్లో తండ్రులు కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వారు ఇలా మాట్లాడి.. సమాజానికి ఏం సందేశం పంపుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో శనివారం అర్థరాత్రి దారుణం జరిగింది. ఓ వలస కూలీ మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తను కొట్టి ముగ్గురు నిందితులు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలిని రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..

Weight Loss Tips: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ కూరగాయలను తింటే బరువు తగ్గొచ్చు..