Andhra Pradesh: టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. మంత్రి జోగి రమేశ్ కామెంట్స్

|

Aug 28, 2022 | 6:59 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, చంద్రబాబుపై...

Andhra Pradesh: టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. మంత్రి జోగి రమేశ్ కామెంట్స్
Jogi Ramesh Comments
Follow us on

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీని, పార్టీ జెండాను కనుమరుగు చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. కుప్పం ప్రజలను చంద్రబాబు బానిసలుగా చేసుకున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం వెళ్లని చంద్రబాబు.. ఇప్పుడు అక్కడ అనవసరమైన హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు పార్టీలు, కులాలు, మతాలు చూడడం లేదని జగన్ ను మాత్రమే చూస్తున్నారని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయలేని చంద్రబాబు ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక వర్గానికి అయినా మేలు చేశారా? అని ప్రశ్నించారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలనే డిమాండ్ తోనే కుప్పం ప్రజలు తిరుగుబాటు చేశారని మంత్రి చెప్పారు. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయిందని మంత్రి తెలిపారు. జనసేన పార్టీకి చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందిస్తున్నారని, కేఏ పాల్ కు, పవన్ కల్యాణ్ కు తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కుప్పంలో మొదలైన తిరుగుబాటు 175 నియోజకవర్గాలకు విస్తరిస్తుంది. ఈ రాష్ట్రంలో తిరగడానికి చంద్రబాబుకు వీల్లేదని ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఓట్లు దండుకుని సున్నం పెట్టారు. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు లేదు. మూడేళ్లలో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రజలే చెప్తున్నారు. కేఏ పాల్ కు పవన్ కు తేడా లేదు. పొత్తుల గురించి మాట్లాడడమే తప్ప టీడీపీ, జనసేన ప్రజలకు ఏం చేసింది. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుంది.

  – జోగి రమేశ్, ఆంధ్రప్రదేశ్ మంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..