Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీకి సంచలన సవాల్ విసిరిన మంత్రి అనిల్ కుమార్..

|

Apr 12, 2021 | 12:26 PM

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయంగా కాకరేపుతోంది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ సంచలన సవాల్ విసిరారు.

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీకి సంచలన సవాల్ విసిరిన మంత్రి అనిల్ కుమార్..
AP Minister Anil Kumar Yadav
Follow us on

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయంగా కాకరేపుతోంది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ సంచలన సవాల్ విసిరారు. ‘తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం, మీ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమేనా?’ అని టీడీపికి సవాల్ విసిరారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్.. తిరుపతి ఎన్నికలను తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి రెఫరెండంగా భావిస్తూ ప్రజల్లోకి వచ్చామని అన్నారు. ‘మా మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన రాజీనామాల సవాల్‌ని స్వీకరీంచే దమ్ము మీకు ఉందా? మా సవాల్ కి ఒక్కరూ స్పందించలేదు. 17వ తేదీ తరవాత మీ ఎంపీ ల రాజీనామాలకు సిద్ధంగా ఉండండి.’ అని వ్యాఖ్యానించారు. ‘రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం.. టిడిపి నేతలు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా? తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని సవాలు విసురుతున్నా.. స్వీకరించే దమ్ము ధైర్యం టిడిపికి ఉందా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇప్పటికే ఈ సవాల్ విసిరారు.. టిడిపి నేతలు తోకముడిచి పారిపోయారు.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభను వాయిదా వేసుకుంటే టిడిపి నేతలు కారు కూతలు కూస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు. వకిల్ సాబ్ సినిమా టిక్కెట్లను పెంచి అభిమానులను, ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. వకిల్ సాబ్‌ను వెనుక వేసుకొని చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నాడరని ఎద్దేవా చేశారు. ఇంతకీ చంద్రబాబుది ఏ పార్టీ? ఎవరిని సమర్థిస్తున్నారో చెప్పాలి అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 20 శాతం స్థానిక సంస్థలలో కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కుప్పంలో.. నారా లోకేష్ కు మంగళగిరిలో.. ప్రజలు తిక్క కుదిర్చారని వ్యాఖ్యానించారు. అయినాసరే ఆ ఇద్దరికీ ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయో, టీడీపీకి ఉన్నాయో త్వరలోనే తేలిపోతుందన్నారు.

Also read:

రవితేజ ‘ఖిలాడి’ టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న సీఐడీ సోదాలు, ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..