Amaravati: ఆయోమంలో రాష్ట్ర ప్రజలు.. క్లారిటీ ఇవ్వాలంటూ.. సీఆర్డీఏ, రెరాలకు లీగల్‌ నోటీసులు..!

|

Mar 21, 2022 | 7:02 AM

అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ, రెరాలకు మరో వివాదం చుట్టుకుంది. ఏకంగా లీగల్ నోటీసులు పంపారు ఓ న్యాయవాది.

Amaravati: ఆయోమంలో రాష్ట్ర ప్రజలు.. క్లారిటీ ఇవ్వాలంటూ.. సీఆర్డీఏ, రెరాలకు లీగల్‌ నోటీసులు..!
Amaravathi
Follow us on

Andhra Pradesh: అమరావతే(Amaravati) రాజధాని అని హైకోర్టు(High Court) తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ(Capital Region Development Authority), రెరా(Real Estate Regulation Act)లకు మరో వివాదం చుట్టుకుంది. ఏకంగా లీగల్ నోటీసులు పంపారు ఓ న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రజలను ఇప్పటికీ మంత్రులు ఆయోమయానికి గురి చేస్తున్నారని, ఇంకా మూడు రాజధానులే అని ప్రకటించడం అనుమానంగా ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

సీఆర్డీఏ, రెరాలకు లీగల్ నోటీసులు పంపారు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్ బాబు. అమరావతిపై రాష్ట్ర హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వ విధానాలు వేరుగా కనిపిస్తున్నాయంటున్నారు ఇంద్రనీల్‌. హైకోర్టు అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చింది. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులే అని ప్రకటించడం అనుమానంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్న వాదన ఉంది. అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానులపై తీర్మానం చేస్తుందా అనే సందిగ్ధత కూడా ఉంది. హైకోర్టు తీర్పుపై శాసనసభలో చర్చ జరిగితే అదో కొత్త సంప్రదాయం అవుతుంది.

రెండు సంవత్సరాలకు పైగా అమరావతి పరిరక్షణ కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన రైతులు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని పరిరక్షణకు ప్రధానంగా సీఆర్డీఏ చట్టం రక్షణ కవచంగా ఉంది. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూములకు ఎకరానికి మూడు లక్షల రూపాయల వంతున నష్టపరిహారం చెల్లించాలనేది వారి ప్రధాన డిమాండ్. ఇన్ని రోజులపాటు తాము అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా తమ ప్లాట్‌లను అభివృద్ధి చేసి ఇవ్వనందున నివాస నిమిత్తం ఇచ్చే ప్లాట్ కు చదరపు గజానికి నెలకు 50 రూపాయలు, వాణిజ్య స్థలానికి 75 రూపాయలు ఇవ్వాలంటున్నారు. రైతుల వద్ద నుంచి ప్లాట్ లు కొనుగోలు చేసిన వారు సైతం అదే డిమాండ్ తో ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపుకు సిఆర్డీఏ జవాబుదారీగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రెరా’ చట్టం కింద సీఆర్‌డీఏ నమోదు చేయించుకోవాల్సి ఉంది. రెరా సైతం సూమోటోగా సీఆర్‌డీఏను తమ పరిధిలోకి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also….  AP Assembly: కల్తీ మద్యంపై టీడీపీ.. పెగాసస్ ఆయుధంగా వైసీపీ.. ఇవాళ హాట్ హాట్‌గా సాగనున్న అసెంబ్లీ!