Andhra Pradesh: వారి విషయంలో తొందరపాటు చర్యలు వద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

|

May 16, 2022 | 10:18 AM

పదోతరగతి(Tenth Exams in AP) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల యాజమానులపై తొందరపాటు చర్యలు వద్దని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు సూచించింది. తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌....

Andhra Pradesh: వారి విషయంలో తొందరపాటు చర్యలు వద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
High Court
Follow us on

పదోతరగతి(Tenth Exams in AP) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల యాజమానులపై తొందరపాటు చర్యలు వద్దని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు సూచించింది. తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడిపై చిత్తూరులో కేసు నమోదైంది. ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నారాయణ విద్యాసంస్థల యజమాన్యానికి ఊరట లభించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. వారి విషయంలో తొందరపాటు చర్యలొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు(High Cort of Andhra Pradesh) న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిలిచ్చిందని, పిటిషనర్లకు మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారంతో సంబంధం లేదని వాదించారు. నారాయణ విద్యా సంస్థల్లో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని, పిటిషనర్లు నిందితులు కానప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసుల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమార్తి తొందరపాటు చర్యలొద్దంటూ మధ్యంతర బెయిలు మంజూరు చేశారు.

నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను గత మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

ATF Price Hike: విమాన ప్రయాణం మరింత ప్రియం కానుందా..? పెరిగిన ఇంధన ధరలు.. వరుసగా పదో సారి పెంపు

Curd Benefits: సమ్మర్‌లో పెరుగు సర్వరోగ నివారిణి.. మరి ఎప్పుడు ఎలా తినాలో తెలుసా..!