AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జీవో 59పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వెనక్కు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

గ్రామ, వార్డు సచివాలయ మహిళా కార్యదర్శులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్‌ 59ను ఉపసంహరించుకుంది

Andhra Pradesh: జీవో 59పై  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..  వెనక్కు తీసుకుంటున్నట్లు  హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
Andhrapradesh
Basha Shek
|

Updated on: Dec 09, 2021 | 4:08 PM

Share

గ్రామ, వార్డు సచివాలయ మహిళా కార్యదర్శులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్‌ 59ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. జీవో 59పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన హైకోర్టుకు తెలియజేశారు. దీంతో పాటు డ్రస్‌ కోడ్‌ నిబంధనలను సైతం వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టుకు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా సిబ్బందిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామనడంతో న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో సంరక్షకులుగా విధులు నిర్వహిస్తోన్న మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్ 23న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 59ని జారీ చేసింది. కానిస్టేబుల్‌కు ఉండే సర్వ అధికారాలు, బాధ్యతలను వారికి అప్పగించాలని ఈ జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏపీ డిస్ట్రిక్ట్‌ పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 1, 6, 11, 21తో పాటు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌కు విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వివాదాస్పద జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా ఈ అక్టోబర్‌ నుంచి జీవో నంబర్‌ 59పై హైకోర్టులో కీలక వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంది.

Also read:

Heart Attack: 30 మంది ప్రాణాలు కాపాడి చనిపోయాడు.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Akhanda Collection: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్

AP CM on PRC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్.. పీఆర్సీపై సీఎం జగన్ కీలక సమీక్ష!

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..