
వితంతువులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. జూన్ 12 నుంచి వీరికి కొత్త పెన్షన్లను జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వితంతువులకు ప్రతి నెలా రూ. 4 వేలు నేరుగా అకౌంట్లోకి రానున్నాయి. జూన్ 12 నుండి కొత్త పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ వంటివి వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరం. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి పించన్ మంజూరు చేశారు. లబ్దిదారుల జాబితాలో చేర్చిన తర్వాత మీకు పింఛన్ ప్రతీ నెలా అందిస్తారు. భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛన్ అందిస్తారు. వితంతు పింఛన్ పొందేందుకు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండకూడదు. ఇక కుటంబంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లను అందిస్తోంది. ఈ పథకం ద్వారా వృద్దులు, వికలాంగుల, నేత, గీత కార్మికులకు నెలనెలా పింఛన్ అందిస్తోంది. నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు అందిస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు పింఛన్ అందిస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది అందిస్తున్నారు. ఒకటో తేదీ ఆదివారం లేదా పబ్లిక్ హాలీవేడ్ వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నారు. ఏపీ గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పెన్షన్లు అందిస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్త పింఛన్లను జారీ చేయలేదు. దీంతో కొత్త పించన్లకు దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానిస్తారా అనే దానిపై అర్హులు ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయోనని నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.