Andhra Pradesh: ఏపీలోని విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఇంగ్లీష్ మీడియం చదువు ఫ్రీ.. హాస్టల్ వసతి కూడా ఉచితమే..

ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా సులువుగా అప్లై చేసుకోవచ్చు.

Andhra Pradesh: ఏపీలోని విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఇంగ్లీష్ మీడియం చదువు ఫ్రీ.. హాస్టల్ వసతి కూడా ఉచితమే..
Students

Updated on: Feb 20, 2026 | 7:18 AM

ఏపీలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్. మెడల్ స్కూళ్లల్లో అడ్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూళ్లు ఉండగా.. వీటిల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి అడ్మిషన్లను ప్రారంభించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు తన ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. మోడళ్లు స్కూళ్లు ఉన్న మండలాల్లోనే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ విద్యార్థులకు నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ మార్కుల ప్రతిపాదికన విద్యార్థులు మోడల్ స్కూళ్లల్లో చదువుకునేందుకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంపికైన వారికి ఉచితంగా విద్య అందిస్తారు. ఈ స్కూళ్లల్లో పేద విద్యార్థులు ఇంగ్లీష్ బోధన పొందవచ్చు

అర్హతలు ఇవే..

-బీసీ, ఓసీ విద్యార్ధులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్ట్ 31 మధ్య జన్మించి ఉండాలి
-ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబర్ నుంచి 2016 ఆగస్ట్ 31 మధ్య జన్మించి ఉండాలి
-సంబంధిత జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లల్లో వరుసగా రెండేళ్లు చదివి ఉండాలి
-ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ పొంది ఉండాలి

దరఖాస్తు ఎలా అంటే..?

-ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు

-ముందుగా పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ కేటాయిస్తారు

-ఆ నెంబర్‌ ఆధారంగా www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్ సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు

-ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి

-ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.150 దరఖాస్తు ఫీజు చెల్లించాలి

-పరీక్ష ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది

-100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి

-మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, సాంఘికంపై పరీక్ష ఉంటుంది

-ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు

దరఖాస్తు తేదీలు

ఫిబ్రవరి 24వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. మార్చి 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు.  ఆ తర్వాత విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ఉంటుంది. జూన్ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. విద్యార్థులు నివాసం ఉండే మండలంలో ఉండే మోడల్ స్కూళ్లల్లోనే చదువుకోవచ్చు. విద్యతో పాటు ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్రామాల్లోని పేద విద్యార్థులకు ఇది ఒక వరంగా చెప్పవచ్చు. ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్య ఈ స్కూళ్ల ద్వారా పొందే అవకాశముంది.

 

 

Follow Us