
సంక్రాంతి పండుగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. కొత్త పథకాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న స్కీమ్స్‌లో ప్రజలకు ఉపయోగపడేలా పలు మార్పులు చేస్తోంది. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, కొత్త అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటివి ఈ సంక్రాంతికి అమల్లోకి రానుండగా.. త్వరలో మరో కొత్త పథకాన్ని లాంచ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా వారందరీ అకౌంట్లోకి రూ.10 వేలు జమ చేయనుంది. ఈ పథకం వివరాలు ఏంటి..? అర్హలు ఎవరు..? పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే వివరాలు ఒకసారి చూద్దాం.
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. పేద బ్రాహ్మణుల సంక్షేమం, వారికి అండగా నిలిచేందుకు ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే.. సంబంధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నారు. వీటికి నేరుగా అకౌంట్లో జమ చేయనున్నారు. కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే గరుడ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా మొదలైంది. తాజాగా అమరావతిలోని సచివాలయంలో ఈ పథకం విధివిధానాలు, అమలుపై మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ సమావేశమై చర్చించారు. పథకం ఎలా అమలు చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.
గరుడ పథకంకు సంబంధించి మార్గదర్శకాలపై చర్చించారు. త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఆ వెంటనే పూర్తి వివరాలు బయటపడనున్నాయి. 2014లో చంద్రబాబు బ్రహ్మణుల కోసం బ్రహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా బ్రహ్మణులకు అనేక పథకాలు అమలు చేయనున్నారు. నిరుపేద బ్రహ్మణులకు ఆర్ధికంగా సాయం అందిస్తున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణ మస్తు, కశ్యప, భారతి, భారతి విదేశీ విద్య వంటి పథకాలను బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలు చేస్తారు. అయితే ఆ తర్వాత ఈ పథకాలు నిలిచిపోగా.. ఇప్పుడు మళ్లీ అమలు చేసేందుకు రంగం సిద్దమవుతోంది. త్వరలోనే అన్ని పథకాలను తిరిగి పునరుద్దరించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. బ్రహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.