ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. మహిళా దినోత్సవం పురస్కరించుకుని జగన్ కానుక.. మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి.. 10 శాతం రాయితీ

| Edited By: Team Veegam

Mar 05, 2021 | 11:53 AM

ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త ప్రకటించింది. ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. మహిళా దినోత్సవం పురస్కరించుకుని జగన్ కానుక..  మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి.. 10 శాతం రాయితీ
Follow us on

AP Government scheme : ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త ప్రకటించింది. ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.  వచ్చే సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి.. 10 శాతం రాయితీ పొందండి. ఎంపిక చేసిన మొబైల్‌ షాపుల్లో మాత్రమే సుమా. ఇదేదో మొబైల్‌ షోరూమ్‌ యాడ్‌ కాదు. ప్రభుత్వం ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ కానుకను ప్రకటించారు. మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్‌ ఫోన్‌ కొని.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ 10 శాతం ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు.

ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది జగన్ సర్కార్. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదు. మహిళల భద్రత కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇటీవల ఏపీలో ‘దిశ’ చట్టం అమలుపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ‘దిశ’ చట్టం పటిష్టంగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు. ‘దిశ’ అమలు, మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక దృష్టి కారణంగా 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు తెలిపారు. 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేశామన్నారు. 080 కేసుల్లో 15 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేయగా 103 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని అధికారులు వివరించారు.

రాష్ట్రంలో సైబర్‌ బుల్లీయింగ్‌పై 1531 కేసులు పెట్టామని చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసుల్లో 823 కేసులు నమోదయ్యాయి. గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని అధికారులు వివరించారు. సైబర్‌ మిత్ర ద్వారా 2,750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 154 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ చేశామని వెల్లడించారు.మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు తగ్గట్లు వ్యవస్థను తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ కోరారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు కావాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలకు మరింత భద్రత కల్పించాలన్న ఉద్దేశ్యంతో మొబైల్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also… ఏపీలో బీజేపీకి జనసేన షాక్.. మున్సిపల్‌ ఎన్నికల్లో పాతమిత్రుడితో కలిసి చెట్టాపట్టాల్‌

సిగరెట్ కాల్చడం మానలేకపోతున్నారా..! అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి.. తర్వాత మీకే తెలుస్తుంది..

భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!