Airports Guidelines: కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ మార్గదర్శకాలు.. విదేశీ ప్రయాణికులకు విధిగా 14 రోజుల క్వారంటైన్‌

|

May 14, 2021 | 9:07 AM

రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్‌ నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Airports Guidelines: కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ మార్గదర్శకాలు.. విదేశీ ప్రయాణికులకు విధిగా 14 రోజుల క్వారంటైన్‌
Ap Quarantine Guidelines In Airports
Follow us on

AP Quarantine Guidelines in Airports: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వారిపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్‌ నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో భాగంగా కోవిడ్‌ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలని సూచించింది. మిగిలిన వారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలు అమలులోకి తీసుకువచ్చినట్లు ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది..

Read Also… Floating Ambulance: కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న కశ్మీర్ వాసి.. బోటునే అంబులెన్స్‌గా మార్చిన యువకుడు..!