Farmers APP: ఏపీలోని రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్త యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. అన్నీ సేవలు ఒకేచోట..

ఏపీలోని రైతుల కోసం ప్రభుత్వం మరో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. వివరాలన్నీ ఒకేచోట లభించేలా యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను రైతులందరూ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈ మేరకు రైతుల మొబైల్స్‌కు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా యాప్ లింక్‌లు పంపుతోంది.

Farmers APP: ఏపీలోని రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్త యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. అన్నీ సేవలు ఒకేచోట..
Ap Farmers App

Updated on: Jan 29, 2026 | 7:03 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. రైతులకు సమాచారం మొత్తం ఒకేచోట లభించేలా సరికొత్త యాప్‌ను రూపొందించింది. తాజాగా ఈ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రైతులు వ్యవసాయ సమాచారం, పంట సమాచారం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలు లాంటి వివరాలన్నీ ఒకేచోట చూసుకోవచ్చు. సమాచారం మొత్తం ఒకేచోట ఉండటంతో వెదర్ రిపోర్ట్, ప్రభుత్వ పథకలు, సబ్సిడీ వివరాలతో రైతులు ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అన్ని రంగాల్లో టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా రైతులకు ఉపయోగపడేలా ఈ కొత్త యాప్‌ను లాంచ్ చేసింది.

మరో కొత్త యాప్

ఏపీలోని రైతుల కోసం వ్యవసాయ శాఖ నూతనంగా వెబ్‌సైట్‌తో పాటు రెండు యాప్‌లను తీసుకొచ్చింది. https://agriculture.ap.gov.in/home వెబ్‌సైట్‌తో పాటు ఏపీ అగ్రీ, APAIMS 2.0 పేరుతో రెండు యాప్‌లను ప్రవేశపెట్టింది. ఈ యాప్స్ ద్వారా వివిధ పంటల సాగు, చీడ పీడల వివరాలు, వాతావరణ, మార్కెట్ సమాచారం, ప్రభుత్వ రాయితీ పథకాలు మొదలగు అన్నీ వివరాలు తెలుసుకోవచ్చని ఏపీ వ్యవసాయశాఖ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్లలో ఈ యాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా రైతుల ఫోన్లకు ప్రభుత్వం మెస్సేజ్‌లను పంపుతోంది.

ఫార్మర్ చాట్

ఇక ఏపీ ప్రభుత్వం ఫార్మర్ చాట్ అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ సహాకారంతో ఈ యాప్ రూపొందించారు. ఈ యాప్ వ్యవసాయానికి సంబంధించి అన్ని సలహాలు రైతులకు అందిస్తుంది. రైతులకు ఏమైనా అనుమాలు ఉంటే వాటన్నింటికి సమాధానాలు ఇస్తుంది. ఇక వ్యవసాయమే కాకుండా పాడి, కోళ్ల, మత్స్య సాగు వంటి అనుబంధ రంగాల గురించి కూడా వివరాలు అందిస్తోంది. ఇక చీడ పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను యాప్ ద్వారా సులభంగా రైతులు తెలుసుకోవచ్చు. తక్కువ ఖర్చు పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి ఎలా సాధించాలనే విషయాలను కూడా చెబుతుంది. ఈ యాప్ ద్వారా కేవలం నిపుణులు అందించిన సమాచారాన్ని మాత్రమే రైతులకు అందేలా సహాయపడుతుంది. గ్రామాల్లోని రైతులకు సాగు పద్దతులపై ఈ యాప్ ద్వారా అవగాహన పొందవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. పంట సాగుకు సంబంధించిన ప్రతీ ప్రశ్నకు ఇందులో సమాధానం తెలుసుకోవచ్చు.  వ్యవసాయ శాఖ కూడా సాంకేతికతను ఉపయోగించుకుని రైతులకు సేవలు అందిస్తోంది. అందులో భాగంగానే ఈ యాప్స్ తీసుకొచ్చింది.