AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీచర్లకు సెలవులు రద్దు.. ఎమర్జెన్సీ తప్ప మిగతా సమయాల్లో విధుల్లో ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 20 వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపు...

Andhra Pradesh: టీచర్లకు సెలవులు రద్దు.. ఎమర్జెన్సీ తప్ప మిగతా సమయాల్లో విధుల్లో ఉండాల్సిందే
Cm Jagan
Ganesh Mudavath
|

Updated on: Apr 24, 2022 | 9:35 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 20 వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. ఆరోగ్యం అత్యవసర పరిస్థితి తప్ప, మిగిలిన టీచర్లంతా విధుల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మే 20 తర్వాతే టీచర్లకు సెలవులు అందుబాటులోకి రానున్నాయి. కొత్త విద్యాసంవత్సరం జులై 4 నుంచి ప్రారంభం కానుంది.

రాష్ట్రంలో కరోనా కారణంగా గత రెండేళ్లు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఆలస్యంగా ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ రెండేళ్లుగా పిల్లలు చదువులు కోల్పోయినందున ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు సెలవులు తగ్గించి, బడులు కొనసాగించాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా జులై 4వరకు సెలవులు ఇవ్వడమేమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. జూన్‌ 12న తెరవాల్సిన బడులను జులైలో తెరిస్తే సుమారు 18 పని దినాలను విద్యార్థులు కోల్పోతారు. జూన్‌ 15 నాటికి సాధారణంగా ఎండ తీవ్రత తగ్గుతుంది. పాఠశాలలను పునఃప్రారంభించి, గతంలో అభ్యాసన నష్టపోయిన పిల్లలకు బేసిక్స్‌ నేర్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also read:

PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!