Ongole: అరె మిర్చి పంట భలే ఏపుగా పెరిగిందే అనుకునేరు.. లోపలికి వెళ్లి చూస్తే.. పోలీసులకే కళ్లు తిరిగాయ్

|

Dec 05, 2022 | 1:05 PM

కథలు పడుతున్నారు ఖతర్నాక్ గాళ్లు. పంటల మాటున గలీజ్ దందా షురూ చేశారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు.

Ongole: అరె మిర్చి పంట భలే ఏపుగా పెరిగిందే అనుకునేరు.. లోపలికి వెళ్లి చూస్తే.. పోలీసులకే కళ్లు తిరిగాయ్
Chilli Crop (representative image)
Follow us on

మిరిప తోట భలే ఉంది. ఈ రైతు ఏం మందులు వేస్తున్నాడో, ఎలా సాగు చేస్తున్నాడో అనుకుంటున్నారా..? ఆగండి.. ఆగండి ఇక్కడ అసలు కథ వేరే ఉంది. చక్కనైన మిరప మధ్యలో.. ఘాటైన మరో మత్తు వ్యవహారం దాగి ఉంది. ఎవరైనా చేలోకి వెళ్లి చూశారో లేక ఆ పొలం నుంచి వాసన తేడాగా వస్తుందని సమాచారం ఇచ్చారో తెలియదు కానీ.. వన్ ఫైన్ పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అ పొలం వద్ద వాలిపోయారు. లోపలికి వెళ్లి తనిఖీ చేయగా.. వారి అనుమానం నిజమైంది. మిరప చెట్ల కంటే ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను పొలం మధ్యలో పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామ పరిధిలోని పొలంలో వెలుగుచూసింది.

ప్రకాశం జిల్లాలో మత్తుపై వార్ ప్రకటించారు యంగ్ అండ్ డైనమిక్ ఎస్పీ మాలిక గార్గ్. గంజాయి సప్లై చేసి పట్టుబడ్డ పాత నేరస్థులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క.. మత్తు పదర్థాలతో దొరికితే.. సెల్‌లో చిప్పకూడు తినేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కానీ మత్తుగాళ్లు మాట వినలేదు. అదే పనిగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇళ్లలోనే గంజాయి పెంపకం మొదలెట్టారు. దీంతో స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దించారు ఎస్పీ. ఈ టీమ్ గంజాయి బ్యాచ్‌ల తోలు తీస్తుంది.

తాజాగా ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) మాలిక గార్గ్ ఆదేశాలలో మార్కాపూర్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ రాగమయి, దోర్నాల సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు బొమ్మలాపురం గ్రామ పరిధిలోని పొలంలో మిర్చి పంటలో తనిఖీలు నిర్వహించారు.  పంట మధ్యలో గంజాయి మొక్కలు కనిపించడంతో వాటిని పీకి వేసి.. కాల్చివేశారు. మిర్చి పంట రైతు అడపాల చిన్న కొండయ్యకు చెందినదిగా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ లిమిట్స్‌లో కొద్దిరోజులుగా గంజాయి సాగు సమాచారంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరుపుతాడులతో మత్తుగాళ్లను హడలెత్తిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..