Andhra Pradesh: మాంసం ప్రియులకు పండగే పండుగ.. ఉచితంగా చేపల పంపిణీ..

|

Apr 30, 2023 | 2:06 PM

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం వాసులందరికీ చేపల్ని పంచారు సర్పంచ్‌ నాగభూషణం. దీంతో ఊరు ఊరంతా చేపల కూరతో ఘుమఘమలాడింది. బయటవాళ్లకి లీజుకిస్తే చెరువును పాడుచేస్తున్నారని భావించిన సర్పంచ్‌.. గతేడాది గ్రామంలోని చెరువును

Andhra Pradesh: మాంసం ప్రియులకు పండగే పండుగ.. ఉచితంగా చేపల పంపిణీ..
Fish Distribution
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం వాసులందరికీ చేపల్ని పంచారు సర్పంచ్‌ నాగభూషణం. దీంతో ఊరు ఊరంతా చేపల కూరతో ఘుమఘమలాడింది. బయటవాళ్లకి లీజుకిస్తే చెరువును పాడుచేస్తున్నారని భావించిన సర్పంచ్‌.. గతేడాది గ్రామంలోని చెరువును బహిరంగ వేలంలో లీజుకు తీసుకున్నారు. ఆ చెరువులో శీలావతి, కట్ల, రూప్‌చంద్‌, గడ్డిచేపలు వేసి సహజసిద్ధమైన పద్ధతిలో పెంచారు.

చేపలన్నీ మంచి సైజులో పెరిగాయి. శీలావతి, కట్ల, రూప్‌చంద్‌, బొచ్చ లాంటివి చూస్తుంటే ముద్దొచ్చేలా కనిపించాయ్. ఊళ్లో జనాలకు చేపల్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటింటికెళ్లి చేపలు అందజేశారు. చెరువు దగ్గర కూడా కొందరికి చేపలు పంచిపెట్టారు. సహజసిద్ధంగా పెరిగిన చేపలు తింటే ఆరోగ్య సమస్యలు రావంటున్నారు స్తానికులు. విలువైన చేపలను ఉచితంగా పంపిణి చేసిన సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..