
Andhra Pradesh: ఏపీలోని ఏలూరు జిల్లా విషాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలంలో ట్రైన్ ఢీకొని నలుగురు మృతి చెందారు. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీరి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఘటన జరిగింది. చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైలు (08046) ఢీకొంది. మహిళ వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు కూడా లభ్యమైంది. ఘటనాస్థలంలో మొబైల్ ఫోన్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిని చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొందని, రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుల వివరాలు గుర్తించడానికి రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి