AP Congress: ఢిల్లీలో మకాం వేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. అసలు కారణం ఇదేనా?..

|

May 17, 2022 | 8:24 AM

AP Congress: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దాంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు.

AP Congress: ఢిల్లీలో మకాం వేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. అసలు కారణం ఇదేనా?..
Kiran Kumar Reddy
Follow us on

AP Congress: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దాంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. నేడు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో కిరణ్‌‌కుమార్ ‌రెడ్డి భేటీ అవుతారు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు తిరిగి పార్టీలోకి రప్పించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలను పార్టీలోకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పార్టీ రాష్ట్ర నేతల్ని ఆదేశించారు.

2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దూరంగా ఉన్నారు. 2014 తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా కొంతకాలం సాగింది. అయితే ఆయన ఏ పార్టీలో కూడా చేరలేదు. ఇటీవలే కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి సంతోష్‌కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. చిత్తూరులో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సంతోశ్‌కుమార్‌రెడ్డిని వ్యూహాత్మకంగా పార్టీలో చేర్చుకుంది టీడీపీ.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీలో కిరణ్‌కుమార్ రెడ్డి చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. స్వగ్రామానికి చెందిన తన సన్నిహితులు, మిత్రులు, అనుచరులతో ఇప్పటికే కిరణ్‌కుమార్ రెడ్డి ఈ విషయమై చర్చించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిరణ్‌కుమార్‌రెడ్డికి పీసీసీ చీఫ్ లాంటి పదవిని అప్పగించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా అధిష్ఠానంతో భేటీ తర్వాత.. నల్లారి తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.